Crime3rd Aug 11:06 AMSunil Byrisetty1 min read
ఆమెకు భద్రతేదీ? 18 నిమిషాలకో అత్యాచారం!
దేశంలో ఆడబిడ్డలకు కనీస భద్రత కరువైంది. మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. సగటున రోజుకు దేశవ్యాప్తంగా 1,210 మంది మహిళలపై నేరాలు చోటు చేసుకొంటున్నాయి. ఈ ఘటనల్లో బీజేపీపాలిత రాష్
దేశంలో ఆడబిడ్డలకు కనీస భద్రత కరువైంది. మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. సగటున రోజుకు దేశవ్యాప్తంగా 1,210 మంది మహిళలపై నేరాలు చోటు చేసుకొంటున్నాయి. ఈ ఘటనల్లో బీజేపీపాలిత రాష్ట్రాలే టాప్-5 స్థానాల్లో ఉన్నాయి. ఇటీవల విడుదలైన జాతీయ నేర గణాంక విభాగం (ఎన్సీఆర్బీ-2024) నివేదిక ఈ మేరకు వెల్లడించింది. 2024 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4,41,534 మంది మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరిగాయి. 66,396 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, 47,954 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 36,536 కేసులతో రాజస్థాన్ మూడో స్థానంలో నిలిచింది. మహిళలపై నేరాల్లో హత్యలు, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, కిడ్నాప్‌లు, గృహహింస, వరకట్న వేధింపులు తదితరాలు ప్రధానంగా ఉన్నాయి.