News2nd Jul 10:38 AMSunil Byrisetty1 min read

పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసులు

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జూన్ 22వ తేదీన తమిళనాడులోని మదురైలో నిర్వహించిన మురుగన్ భక్తుల కాన్ఫరెన్స్ మీటింగులో మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రస

పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసులు
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జూన్ 22వ తేదీన తమిళనాడులోని మదురైలో నిర్వహించిన మురుగన్ భక్తుల కాన్ఫరెన్స్ మీటింగులో మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించారని పవన్ కళ్యాణ్, మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై మదురై పీపుల్ ఫెడరేషన్ ఫర్ కమ్యునల్ హార్మొనీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారంటూ పవన్ కళ్యాణ్ మీద అన్నానగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయాలు వేడెక్కాయి. ఈ కేసుపై పవన్ స్పందన ఎలా ఉండబోతుందంటూ చర్చలు జరుగుతున్నాయి.
Andhra Pradesh news
pawan kalyan Tamil Nadu
Criminal Case
Hindu Munnani
FIR
Peoples Federation for Communal Harmony
Kadeshwara Subramaniam
BJP
ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై క్రిమిన‌ల్ కేసు నమోదు
Scroll for the next article