Crime13th Oct 05:25 PMSunil Byrisetty1 min read
సీఎం జిల్లాలో ఐఏఎస్ అధికారిపై క్రిమినల్ కేసు
సీఎం చంద్రబాబు సొంత జిల్లాతోపాటు సొంత నియోజకవర్గంలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఏపీ కేడర్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి, కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(
సీఎం చంద్రబాబు సొంత జిల్లాతోపాటు సొంత నియోజకవర్గంలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఏపీ కేడర్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి, కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కడ) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వికాస్ మర్మత్ పై బెంగళూరులో కేసు నమోదైంది. బెంగళూరులోని ఒక పబ్‌లో జరిగిన గొడవకు సంబంధించి ఐఏఎస్ వికాస్ మర్మత్ తన స్నేహితులతో కలిసి విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. అంతే కాకుండా వారిని అసభ్య పదజాలంతో దూషించి, వారిపై బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగాలు నమోదయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌తో పాటు అభయ్ ఉదయ్ సింగ్, నితీశ్, రోషన్‌లపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సీఎస్ సాయి ప్రసాద్ ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.