Politics19th Aug 02:10 PMSunil Byrisetty1 min read

క్రిమినల్ కేసులే పాలకుల అర్హతలా?

పార్లమెంటులో 326 మంది ఎంపీలు, దేశంలో 14 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని సుప్రీంకోర్టుకు ఒక అమికస్ క్యూరీ ఒక నివేదిక సమర్పించారు. ఈ కేసుల్లో తెలంగాణ ముఖ్యమ

క్రిమినల్ కేసులే పాలకుల అర్హతలా?
పార్లమెంటులో 326 మంది ఎంపీలు, దేశంలో 14 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని సుప్రీంకోర్టుకు ఒక అమికస్ క్యూరీ ఒక నివేదిక సమర్పించారు. ఈ కేసుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై 89 కేసులు ఉన్నాయని తెలిపారు. ఆయన తర్వాత పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిపై 29 కేసులు ఉన్నాయని వెల్లడించారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పై 19 కేసులు పెండింగ్లో ఉన్నాయని ఆ నివేదికలో తేల్చారు. సుప్రీంకోర్టులో సమర్పించిన ఈ నివేదికను ఇప్పుడు బయట పెట్టారు. లోకసభలో 543 మంది సభ్యులకు గాను 251 మంది, రాజ్యసభలో 203 మంది సభ్యులుగాను 75 మంది సభ్యులపై కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. దేశం మొత్తం మీద శాసనకర్తలపై ఎంపీలు ఎమ్మెల్యేలు కలుపుకొని 4వేల క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు.
Indian Politics
Political Leaders
Pending Cases
Criminal Cases
Supreme Court
MPs
MLAs
Chief Ministers
Elected Representatives
Parliament
డీకే శివకుమార్
రాజకీయ జవాబుదారీతనం
క్రిమినల్ కేసులు
ప్రజాప్రతినిధులపై కేసులు
Scroll for the next article