News27th Mar 11:55 AMSunil Byrisetty1 min read
ఏపీలో 5 ప్రభుత్వ వైద్యశాలలకు క్రిటికల్ కేర్ బ్లాక్‌లు
ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్రానికి 5 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు మంజూరయ్యాయి. దీనిలో భాగంగా 50 బెడ్స్ అత్యాధునిక క్రిటికల్ కేర్ ఐసి
ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్రానికి 5 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు మంజూరయ్యాయి.
దీనిలో భాగంగా 50 బెడ్స్ అత్యాధునిక క్రిటికల్ కేర్ ఐసియు విభాగం ఏర్పాటు కానున్నాయి.
ఒక్కో యూనిట్‌కు రూ. 23 కోట్ల 75 లక్షలు చొప్పున మొత్తం 118 కోట్ల 75 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
50 ఐసియు బెడ్స్ క్రిటికల్ కేర్ విభాగాలు ఏర్పాటు అయ్యే ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలు
1. రాయచోటి ఏరియా ఆసుపత్రి (అన్నమయ్య జిల్లా)
2. చీరాల ఏరియా ఆసుపత్రి (బాపట్ల జిల్లా)
3. పాలకొండ ఏరియా ఆసుపత్రి (పార్వతీపురం మన్యం జిల్లా)
4. భీమవరం ఏరియా ఆసుపత్రి (పశ్చిమ గోదావరి జిల్లా)
5. రంగరాయ మెడికల్ కళాశాల, కాకినాడ