National15th Sep 06:03 PMSunil Byrisetty1 min read

న్యాయవ్యవస్థపై విమర్శలు తప్పుకాదు.. అవసరమే!

న్యాయవ్యవస్థను ప్రశ్నించొచ్చు.. విమర్శించొచ్చని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ కూడా ప్రజల పరిశీలనకు, ప్రశ్నలకు అతీతం కాదన్నారు. ప్రజాస్వా

న్యాయవ్యవస్థపై విమర్శలు తప్పుకాదు.. అవసరమే!
న్యాయవ్యవస్థను ప్రశ్నించొచ్చు.. విమర్శించొచ్చని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ కూడా ప్రజల పరిశీలనకు, ప్రశ్నలకు అతీతం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థపై చర్చ, విమర్శలు అవసరమే అని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసం తీర్పులు తమకు అనుకూలంగా రావడంపై కాదన్నారు. న్యాయ ప్రక్రియ న్యాయంగా ఉందనే నమ్మకంపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, సంస్కరణలు నిరంతరం కొనసాగాలని పేర్కొన్నారు. జడ్జిలపై వచ్చే ఫిర్యాదుల వ్యవహారంలో ప్రస్తుత విధానం పటిష్టంగానే ఉందని CJI వెల్లడించారు.
Indian Judiciary
Supreme Court
CJI Surya Kant
Judiciary
Judicial Reforms
Judicial Accountability
Transparency
పారదర్శకత
భారత న్యాయవ్యవస్థ
ప్రజాస్వామ్యం
న్యాయ ప్రక్రియ
న్యాయవ్యవస్థపై విమర్శలు
Scroll for the next article