News17th Jul 03:15 PMSunil Byrisetty1 min read
ఫసల్ బీమాతో అన్నదాతకు ఆర్థిక ధీమా
ఆపత్కాలంలో అండగా నిలిచే పంట బీమా పథకాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. రుణం తీసుకునే రైతులతో పాటు రుణేతర రైతులు కూడ
ఆపత్కాలంలో అండగా నిలిచే పంట బీమా పథకాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. రుణం తీసుకునే రైతులతో పాటు రుణేతర రైతులు కూడా తప్పనిసరిగా పథకాల్లో చేరాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం వంటి పరిస్థితుల నేపథ్యంలో పంట నష్టాల ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నందున రైతులకు ఫసల్ బీమాపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పునర్నిర్మించిన వాతావరణ ఆధారిత పంట బీమా పథకాల్లో చేరేలా ప్రోత్సహించాలన్నారు. ఇందుకు సమన్వయ శాఖల అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు. వీటితో అతి తక్కువ ప్రీమియంతోనే కష్టకాలంలో అధిక ఆర్థిక భరోసా లభించనుందని.. ఉదాహరణకు వరికి ఎకరాకు బీమా మొత్తం రూ. 42,500 కాగా రైతు వాటా ప్రీమియం రూ. 850 చెల్లిస్తే సరిపోతుందన్నారు. వరికి సంబంధించి పథకంలో నమోదుకు ఆగస్టు 15వ తేదీ ఆఖరు తేదీ కాగా ఎర్ర మిరప, మొక్కజొన్న, పెసరకు జులై 31 చివరితేదీ అని తెలిపారు. పత్తికి ఈ నెల 24వ తేదీలోగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని వివరించారు.