News20th Aug 01:40 PMSunil Byrisetty1 min read
బీమా నమోదుకు ఈ నెలాఖరు వరకే గడువు
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, అనిశ్చిత వర్షపాతం పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పంటల బీమా విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. పంటల బీమా నమో
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, అనిశ్చిత వర్షపాతం పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పంటల బీమా విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. పంటల బీమా నమోదు చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉన్నందున రైతులు ఆలస్యం చేయకుండా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ వేదికగా పిలుపునిచ్చారు. వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో అంచనా వేయలేమని, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం వంటి పరిస్థితుల్లో రైతుకు ఆర్థిక రక్షణ కల్పించడంలో పంటల బీమా అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. పంటల బీమా కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటా చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రాంతం, పంటను బట్టి రైతు వాటా మారుతుందని, కొన్ని ప్రాంతాల్లో రైతు చెల్లించాల్సిన మొత్తం స్వల్పంగా ఉందన్నారు. మిగిలిన ప్రీమియం భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయని వివరించారు. స్వల్ప మొత్తాన్ని చెల్లించడం ద్వారా పంట నష్టం సంభవించినప్పుడు బీమా రక్షణ పొందే అవకాశం ఉన్నందున రైతులు దీనిని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.