News14th Sep 03:37 PMSunil Byrisetty1 min read

స్వాతంత్ర్య పోరాటంలో మహిళలది కీలక పాత్ర!

భరత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్దాలకు ముందే ప్రారంభమైందని జాతీయ మహిళా సాధికారత సదస్సులో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అన్నారు. మహిళకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న భారత సంప్రదాయమని పే

స్వాతంత్ర్య పోరాటంలో మహిళలది కీలక పాత్ర!
భరత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్దాలకు ముందే ప్రారంభమైందని జాతీయ మహిళా సాధికారత సదస్సులో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అన్నారు. మహిళకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న భారత సంప్రదాయమని పేర్కొన్నారు. దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో స్త్రీలు కీలకపాత్ర పోషించారని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలోనూ మహిళలు కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదన్నారు. మహిళల అభివృద్ధి కోసం రాజ్యాంగం అనేక నిబంధనలు రూపొందించిందని, ఆదివాసీ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ఇవాళ రాష్ట్రపతిగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Women in Freedom Struggle
Women Empowerment
Lok Sabha Speaker Om Birla
National Women Empowerment Conference
రాజ్యాంగ నిబంధనలు
ఆదివాసీ మహిళ రాష్ట్రపతి
Scroll for the next article