News3rd Jul 05:20 PMSunil Byrisetty1 min read
విశాఖ చరిత్రలో క్రూయిజ్ టర్మినల్ ఓ మైలురాయి
విశాఖపట్నం చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టర్మినల్ ఓ మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖలో పర్యటించిన మంత్రి కందుల
విశాఖపట్నం చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టర్మినల్ ఓ మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నం పోర్టులో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ కు వచ్చిన కార్డేలియా సముద్ర విహార నౌకను వర్చువల్ గా పాల్గొన్న కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అలలపై ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతులను అందించే విలాసవంతమైన సముద్ర విహార నౌకను ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తద్వారా చెన్నై-విశాఖ-పుదచ్చేరి మధ్య క్రూయిజ్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ సందర్భంగా నౌకలో కల్పించిన వసతులను, పర్యాటకులకు అందించే సౌకర్యాలను, ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీటీడీసీ ఏర్పాటు చేసిన పర్యాటక స్టాళ్లను మంత్రి దుర్గేష్ సందర్శించారు. అనంతరం టెర్మినల్ బిల్డింగ్, స్పెషల్ లాంజ్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్స్ తదితర అంశాలను పరిశీలించారు.