News25th Mar 09:02 AMSunil Byrisetty1 min read

పతకాలు సాధించిన ఉద్యోగినులకు సిఎస్ అభినందలు

ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొన్నరాష్ట్ర సచివాలయ ఉద్యోగులు కాంస్య పతకాలు సాధించారు. ఆ ఉద్యోగులకు ప్రభుత్వ ప్రధాన

పతకాలు సాధించిన ఉద్యోగినులకు సిఎస్ అభినందలు
ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొన్నరాష్ట్ర సచివాలయ ఉద్యోగులు కాంస్య పతకాలు సాధించారు. ఆ ఉద్యోగులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అభినందనలు తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న మద్దా బేబి సరోజిని, జిఏడిలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న సహదేవ సత్యవతి కాంస్య పతకాలు సాధించారు. వీరు రాష్ట్ర సచివాలయానికి వచ్చి సీఎస్‌ను కలిశారు. వారు సాధించిన కాంస్య పతకాలు, ప్రశంసా పత్రాలను సిఎస్ కు చూపించారు. ఈసందర్భంగా సిఎస్ విజయానంద్ ఇద్దరు క్రీడా కారులను ప్రత్యేకంగా అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ ఉద్యోగులు స్ఫూర్తిగా ప్రభుత్వోద్యోగులంతా క్రీడల్లోనూ సత్తా చాటాలని అన్నారు.
CS
Employees
Table Tennis
మద్దా బేబి సరోజిని
Scroll for the next article