Entertainment1st Oct 04:29 PMSunil Byrisetty1 min read
థియేటర్లలో ‘గీతాంజలి’.. ఎప్పుడంటే
కల్ట్ క్లాసిక్ ప్రేమకథ ‘గీతాంజలి’ మరోసారి వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతోంది. నాగార్జున, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మళ్లీ మరోసారి నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగ
కల్ట్ క్లాసిక్ ప్రేమకథ ‘గీతాంజలి’ మరోసారి వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతోంది. నాగార్జున, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మళ్లీ మరోసారి నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని నాగార్జున నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సామాజిక మాధ్యమంలో వెల్లడించింది. దాదాపు 37 ఏళ్ల క్రితం 1989లో విడుదలైన ఈ ప్రేమకావ్యాన్ని 4K డిజిటల్ క్వాలిటీ, రీ-మాస్టర్డ్ ఆడియోతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. గతంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల రీ-రిలీజ్ వాయిదా పడుతూ రాగా, ఇప్పుడు నవంబర్ 13న విడుదల ఖరారైంది. దీంతో అక్కినేని అభిమానులు, సినీ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున తన నటనతో అప్పట్లోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచారు. నటి గిరిజ షెట్టర్ తన అల్లరి, అమాయకత్వంతో ‘గీతాంజలి’ పాత్రకు ప్రాణం పోశారనే చెప్పవచ్చు.