News7th Aug 08:43 AMSunil Byrisetty1 min read
కృష్ణా తీరంలో కల్చర్ డిస్ట్రిక్ట్!
రాజధాని అమరావతిలో కల్చర్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా నదీ తీరంలో 250 ఎకరాలను కల్చర్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు కోసం కేటాయించింది. ఈ ప్రాంతాన్ని ప్రముఖ పర్యా
రాజధాని అమరావతిలో కల్చర్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా నదీ తీరంలో 250 ఎకరాలను కల్చర్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు కోసం కేటాయించింది. ఈ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. నదీ కనుమలు, విహారయాత్రలు, పచ్చని పచ్చిక మైదానాలతో విహార యాత్రలకు అనుకూలంగా తీర్చిదిద్దనుంది. అక్కడే క్రాఫ్ట్ విలేజ్, కల్చరల్ సెంటర్, యాంఫి థియేటర్ తదితరాలను ఏర్పాటు చేయనుంది. నదీ తీరాన్ని ఆనుకుని పర్యాటకులు కుటుంబంతో సేద తీరేందుకు అన్ని ఏర్పాట్లు చేయనుంది. పిల్లలు ఆడే ప్రాంతం, సెల్ఫీ స్పాట్లు, ఇంకా వ్యూ పాయింట్లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. త్వరలోనే పూర్తి ప్రణాళికలు ఖరారు చేయనుంది.