Crime26th Apr 11:41 AMSunil Byrisetty1 min read
సీబీఐ పేరుతో వీడియోకాల్.. భారీగా డబ్బు!
సైబర్ నేరగాళ్లు కోనసీమ జిల్లా వాసిని కొల్లగొట్టారు. సీబీఐ పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డారు. కొత్తపేటలో ఓ విశ్రాంత ఉద్యోగినిని బెదిరించి భారీ మొత్తంలో డబ్బు కాజేశారు. బాధితురాలు ర
సైబర్ నేరగాళ్లు కోనసీమ జిల్లా వాసిని కొల్లగొట్టారు. సీబీఐ పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డారు.
కొత్తపేటలో ఓ విశ్రాంత ఉద్యోగినిని బెదిరించి భారీ మొత్తంలో డబ్బు కాజేశారు.
బాధితురాలు రూ. 30 లక్షల నగదును బ్యాంకులో జమ చేయడాన్ని కేటుగాళ్లు గమనించారు.
ఆమె వివరాలు సంపాదించి సీబీఐ అధికారులమంటూ ఫోన్ చేశారు.
డబ్బు ఇవ్వకుంటే కుమారులను చంపేస్తామని వీడియో కాల్ చేసి బెదిరించారు.
దీంతో భయపడిన ఆమె ఆన్‌లైన్ ద్వారా నగదును బదిలీ చేశారు.
ఆ తర్వాత అది మోసమని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.