Crime18th May 09:19 AMSunil Byrisetty1 min read
ఎస్సై పేరుతో రూ.70 వేలకు టోపీ!
కృష్ణా జిల్లా వీరవల్లికి చెందిన ఓ వ్యక్తిని సైబర్ తరహా నేరగాళ్లు మాటలతో మాయ చేశారు. రూ.70 వేల నగదు ఫోన్ పే ద్వారా లాగేశారు. ఆర్నేపల్లి రంగారావు స్థానికంగా సిమెంట్, ఇనుము వ్యాపారం న
కృష్ణా జిల్లా వీరవల్లికి చెందిన ఓ వ్యక్తిని సైబర్ తరహా నేరగాళ్లు మాటలతో మాయ చేశారు. రూ.70 వేల నగదు ఫోన్ పే ద్వారా లాగేశారు.
ఆర్నేపల్లి రంగారావు స్థానికంగా సిమెంట్, ఇనుము వ్యాపారం నిర్వహిస్తుంటారు.
ఈయనకు గుర్తుతెలియని నంబరు నుంచి ఫోన్ చేసి బురిడీ కొట్టించారు.
తాను ఏఎస్ఐ ఆనందరావునని, ఎస్ఐకి అత్యవసరంగా రూ.70వేలు నగదు కావాలని, సాయంత్రం తిరిగి ఇచ్చేస్తానని అడిగాడు.
నిజమేనని నమ్మి తన అల్లుడు డోకల శ్రీహరికి చెప్పి నగదు వేయించారు.
సాయంత్రమైనా నగదు పంపించకపోవడం, ఏఎస్ఐ ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉండడంతో విచారించగా అసలు ఆ పేరుతో పోలీస్ స్టేషన్లో ఎవరూ లేరని తెలిసింది.
మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫోన్ పే ద్వారా నగదు వెళ్లిన బ్యాంకు ఖాతా హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు.