News15th Mar 12:44 PMSunil Byrisetty1 min read
రిక్వెస్ట్ పెట్టి.. దోచేస్తున్నారు!
దేశంలో యూపీఐ చెల్లింపులు సర్వసాధారణమైపోయాయి. పాన్ షాపు నుంచి పచారీ సరుకుల వరకు యూపీఐని స్కా్న్ చేసి డబ్బు చెల్లిస్తున్నారు. సులభం, సౌకర్యవంతం కావడంతో నిరక్షరాస్యులు సైతం ఆన్ లైన్ చ
దేశంలో యూపీఐ చెల్లింపులు సర్వసాధారణమైపోయాయి. పాన్ షాపు నుంచి పచారీ సరుకుల వరకు యూపీఐని స్కా్న్ చేసి డబ్బు చెల్లిస్తున్నారు.
సులభం, సౌకర్యవంతం కావడంతో నిరక్షరాస్యులు సైతం ఆన్ లైన్ చెల్లింపులకు అలవాటు పడిపోయారు. దీన్ని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు.
ఓఎల్ఎక్స్ వంటి యాప్స్‌లో పెట్టే వస్తువులను కొంటామంటూ ఫోన్ చేసి నమ్మకంగా మాటలు చెబుతున్నారు.
అమ్మకందారు క్యూఆర్ కోడ్ అడిగి, స్కాన్ చేసి డబ్బు పంపడానికి బదులు, తామే క్యూఆర్ కోడ్ పంపుతామని, దాన్ని స్కాన్ చేయాలని అడుగుతున్నారు.
డబ్బులు వస్తాయి కదా అని స్కా్న్ చేస్తే ఇక అంతే. మరుక్షణం ఖాతాలోని డబ్బులు మాయమైపోతున్నాయి.
దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే కొనుగోలుదారు పంపే క్యూఆర్ కోడ్ ‘రిక్వెస్ట్’ చేసేది. కొంత మొత్తాన్ని రిక్వెస్ట్ చేస్తూ క్యూఆర్ కోడ్‌ను పంపుతారు. దాన్ని స్కాన్ చేయగానే యూపీఐ పిన్ అడుగుతుంది. అది ఎంటర్ చేయగానే ఖాతాలోని సొమ్ము అవతలి వారి ఖాతాకు బదిలీ అయిపోతుంది.
ఆ వెంటనే నంబర్ బ్లాక్ చేసేస్తున్నారు స్కామర్లు.
చెల్లింపు యాప్‌ల్లో ఉండే 'రిక్వెస్ట్' అనే ఫీచర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వాటిపై అవగాహనతో మెలగాలని నిపుణులు సూచిస్తున్నారు.