Crime30th Oct 01:32 PMSunil Byrisetty1 min read

మంత్రి లోకేష్ ఫొటోతో అరకోటికి టోకరా!

మంత్రి నారా లోకేష్ ఫోటో వాట్సాప్ డీపీగా పెట్టుకొని సైబర్ నేరగాళ్లు లక్షలు కొల్లగొట్టారు. X(ట్విట్టర్) లో హెల్ప్ ఎట్ నారా లోకేష్, హెల్ప్ ఎట్ NCBN, హెల్ప్ ఎట్ పవన్ కళ్యాణ్ వంటి హాష్

మంత్రి లోకేష్ ఫొటోతో అరకోటికి టోకరా!
మంత్రి నారా లోకేష్ ఫోటో వాట్సాప్ డీపీగా పెట్టుకొని సైబర్ నేరగాళ్లు లక్షలు కొల్లగొట్టారు. X(ట్విట్టర్) లో హెల్ప్ ఎట్ నారా లోకేష్, హెల్ప్ ఎట్ NCBN, హెల్ప్ ఎట్ పవన్ కళ్యాణ్ వంటి హాష్ ట్యాగ్‌లు పెట్టి వైద్య పరీక్షల కోసం ఆర్థిక సాయం చేస్తామని ట్రాప్ చేశారు. నారా లోకేష్ ఫోటో వాట్సాప్ డీపీగా పెట్టుకొని తాను టీడీపీ NRI కన్వీనర్ అంటూ పరిచయం చేసుకున్న కొండూరి రాజేష్ అనే వ్యక్తి రూ.54.34 లక్షలు కొల్లగొట్టాడు. వైద్య పరీక్షల కోసం ఆర్థిక సాయం అడిగిన వారికి నకిలీ బ్యాంక్ క్రెడిట్ రసీదులు పంపి సాయం చేస్తున్నట్లు నమ్మబలికారు. కొన్ని రోజుల తర్వాత సాయంగా అందించిన డబ్బులు జమ కావాలంటే 4% రెమిటెన్స్ చార్జెస్ కట్టాలంటూ డబ్బులు వసూలు చేశారు. ఇలా ముగ్గురు సైబర్ నేరగాళ్లు రూ.54.34 లక్షలు వసూలు చేశారు. A1 కొండూరి రాజేష్, A2 గుత్తికొండ సాయి శ్రీనాథ్, A3 చిత్తడి తల సుమంత్‌లుగా గుర్తించిన సీఐడీ అధికారులు వారిని హైదరాబాదులో అరెస్ట్ చేశారు.
Andhra Pradesh
Nara Lokesh
Cyber Fraud
WhatsApp Scam
Financial Scam
Hyderabad Police
CID
Online Scam
Telecom Fraud
NCBN
Pawan Kalyan
Tech Crime
Fraud Alert
Scam Awareness
Scroll for the next article