Crime22nd Jan 12:55 PMSunil Byrisetty1 min read

దుర్గమ్మ చీరల పేరుతో సైబర్ మోసాలు !

విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న కనకదుర్గమ్మ దేవస్థానం పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. దేవస్థానం నుంచి ఫోన్ చేసినట్లుగా భక్తులను నమ్మిస్తూ..

దుర్గమ్మ చీరల పేరుతో సైబర్ మోసాలు !
విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న కనకదుర్గమ్మ దేవస్థానం పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. దేవస్థానం నుంచి ఫోన్ చేసినట్లుగా భక్తులను నమ్మిస్తూ.. డబ్బులను కాజేస్తున్నారు. అమ్మవారి పట్టు చీరలు ఇంటికి పంపిస్తాం, మీ పేరు, గోత్ర నామాలతో పూజలు చేస్తామని భక్తులకు ఫోన్లు చేస్తున్నారు. దీనిపై కొందరు భక్తులు ఫిర్యాదు చేయడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇలాంటివి నమ్మి మోసపోవద్దని ఈవో శీనానాయక్ కోరారు. భక్తుల సేవల గురించి.. ఆలయ అధికారిక వెబ్సైట్, సమాచార కేంద్రం, మనమిత్ర వాట్సాప్ సేవల ద్వారా తెలుసుకోవాలని సూచించారు. డబ్బులు కడితే.. అమ్మవారి చీరలు పంపిస్తాం. ప్రత్యేక పూజలు చేస్తామని.. దేవస్థానం నుంచి అధికారికంగా ఎవరూ భక్తులను సంప్రదించరని తేల్చి చెప్పారు. వీటిపై భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ఆలయ ప్రాంగణంలో.. మైక్లో తాము ప్రచారం చేస్తున్నామని వివరించారు.
Andhra Pradesh
Kanaka Durga Temple
Vijayawada
Cyber Fraud
Online Scam Alert
Devotee Warning
భక్తులకు హెచ్చరిక
ఇంద్రకీలాద్రి
ఆలయ వార్తలు
ప్రజా అవగాహన
Scroll for the next article