Crime18th Jul 02:57 PMSunil Byrisetty1 min read
ఏపీకే తెరిస్తే.. ఖాతా ఖాళీ!
వాట్సాప్‌లో వస్తున్న ఏపీకే ఫైళ్లు ఖాతాలు ఖాళీ చేస్తున్నాయి. ఈ- చలాన్ పీడీఎఫ్ ఏపీకే ఫైల్ పేరుతో షేర్ అవుతున్న మెసేజులు ప్రమాదకర మాల్వేర్ కలిగి ఉంటున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడుక
వాట్సాప్‌లో వస్తున్న ఏపీకే ఫైళ్లు
ఖాతాలు ఖాళీ చేస్తున్నాయి. ఈ- చలాన్ పీడీఎఫ్ ఏపీకే ఫైల్ పేరుతో షేర్ అవుతున్న మెసేజులు ప్రమాదకర మాల్వేర్ కలిగి ఉంటున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన యువకుడు ఇలాంటి మెసేజ్ను ముఖ్యమైనదేమోనని తెరిచాడు.
అంతే.. విడతల వారీగా అతని ఖాతా నుంచి రూ.70వేలు విత్ డ్రా అయ్యాయి. ఎరువుల దుకాణం నడిపే కొల్లిపర రాంబాబు ఫోన్లోని డీలర్ల వాట్సాప్ గ్రూప్‌లో 'ఈ చలాన్ పీడీఎఫ్ ఏపీకే' అనే మెసేజ్ నాలుగైదు సార్లు వచ్చింది. ఇదేదో ముఖ్యమైనదేమోనని ఈ నెల 16న ఓపెన్ చేశారు. ఆయన వివరాలు నమోదు చేయాలని రావడంతో చేశారు. కాసేపటి తర్వాత ఆయన ఫోనుకు రూ.49500 నగదు విత్‌డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే బ్యాంకుకు వెళ్లి మేనేజర్‌కు చెప్పారు. ఆయన.. సదరు ఖాతాను నిలిపివేస్తుండగానే మరో రెండు సార్లుగా రూ.10వేల చొప్పున విత్‌డ్రా చేసినట్లు మెసేజ్‌లు వచ్చాయి. మేనేజర్ ఖాతాను నిలిపివేసి, పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించారు. బాధితుడు పోలీసు స్టేషనుకు వెళ్లి.. ఫిర్యాదు చేశారు.