Crime2nd Aug 12:34 PMSunil Byrisetty1 min read
జడ్జి పేరుతో సైబర్ మోసం!
సైబర్ మోసగాళ్ళు చెలరేగిపోతున్నారు. ఏకంగా కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేరును, ఫోటోను ఉపయోగించి సైబర్ నేరస్తులు మోసానికి యత్నించారు. జిల్లా వెలుపల వివిధ కోర్టుల్లో పనిచేస్తున్న
సైబర్ మోసగాళ్ళు చెలరేగిపోతున్నారు. ఏకంగా
కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేరును, ఫోటోను ఉపయోగించి సైబర్ నేరస్తులు మోసానికి యత్నించారు.
జిల్లా వెలుపల వివిధ కోర్టుల్లో పనిచేస్తున్న కొందరు కోర్టు అధికారులకు ప్రధాన న్యాయమూర్తి పేరుతో తెలియని వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫోన్ చేసిన వ్యక్తులు తక్షణం డబ్బులు పంపించాలని ఒత్తిడి చేశారు. ఈ విషయాన్ని గమనించిన ప్రధాన న్యాయమూర్తి జి. గోపి వెంటనే కోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. "ఎవరైనా నా పేరుతో, ఫోటోతో డబ్బులు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని,అలాంటి కాల్స్ పై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు, కోర్టు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన హితవు పలికారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రధాన న్యాయమూర్తి పోలీసు అధికారులకు సూచించారు. ఈ మేరకు హెచ్‌పీడీజే కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.