News30th Sep 12:32 PMSunil Byrisetty1 min read
వీరమాచినేని రామకృష్ణపై కేసు నమోదు
వీరమాచినేని రామకృష్ణ, “డాక్టర్” కోటేశ్వరరావుపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ డాక్టర్, మోసం ఆరోపణలపై ఇద్దరిపై కేసు నమోదైంది. టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న 30 ఏళ్ల లా
వీరమాచినేని రామకృష్ణ, “డాక్టర్” కోటేశ్వరరావుపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ డాక్టర్, మోసం ఆరోపణలపై ఇద్దరిపై కేసు నమోదైంది.
టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న 30 ఏళ్ల లా విద్యార్థి.. వీరమాచినేని రామకృష్ణను సంప్రదించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వీఆర్కే డైట్‌తో టైప్-1 డయాబెటిస్ నయం అవుతుందని ప్రచారం చేశారని విద్యార్థి ఆరోపించాడు. ఇన్సులిన్ తీసుకోవడం ఆపాలని తనకు సూచించినట్లు ఫిర్యాదులో తెలిపాడు. ఇన్సులిన్ ఆపిన రెండు రోజులకే తీవ్ర అనారోగ్యానికి గురైన విద్యార్థి.. డయాబెటిక్ కీటో ఆసిడోసిస్, తీవ్రమైన డీహైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరాడు. సప్లిమెంట్లు, ఇతర సేవల కోసం సుమారు రూ.26 వేల చెల్లించినట్లు విద్యార్థి ఆరోపించాడు. మోసం, మానవ ప్రాణాలకు ముప్పు కలిగించడం, క్రిమినల్ కుట్ర తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద కూడా కేసు నమోదైంది. తనకు పరిహారం చెల్లించాలంటూ ఫిర్యాదుదారు నాంపల్లి వినియోగదారుల కోర్టును కూడా ఆశ్రయించాడు.