Crime22nd Dec 02:39 PMSunil Byrisetty1 min read
క్షణంలో ఖాతా ఖాళీ.. గంటకు రూ.8.54 లక్షల దోపిడీ
టెక్నాలజీ ఎంత ఆధునికమవుతుంటే, సైబర్ నేరగాళ్లు అంతగా దోచేస్తున్నారు. తాజాగా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం ఏపీలో బాగా నేరాలు పెరిగినట్లు తెలుస్తోంది. సగటున ప్రతి
టెక్నాలజీ ఎంత ఆధునికమవుతుంటే, సైబర్ నేరగాళ్లు అంతగా దోచేస్తున్నారు. తాజాగా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం ఏపీలో బాగా నేరాలు పెరిగినట్లు తెలుస్తోంది. సగటున ప్రతి గంటకు రూ.8.54 లక్షలు దోచుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ రూ.751.40 కోట్లు కొల్లగొట్టారు. డిజిటల్ అరెస్టులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఓటీపీ, ఆన్లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్, క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, ఈ-కేవైసీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల పేరిట మోసాలు విపరీతంగా పెరిగాయి. కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఈ ఏడాదిలో మన రాష్ట్రం నుంచి నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. జనవరి నుంచి ఇప్పటివరకూ ఈ పోర్టల్ కు ఏపీ నుంచి 57,673 ఫిర్యాదులు అందాయి.