Crime24th Nov 01:09 PMSunil Byrisetty1 min read
ఎస్బీఐ ఏపీకే పేరుతో వాట్సాప్‌లో సైబర్ స్కామ్
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో లక్షలాది మంది వాట్సాప్ నంబర్లకు ఏపీకే ఫైళ్లు పంపి దోచుకుంటున్నారు. ‘ఈ రోజు అర్ధరాత్రిలోపు మీ ఆధార్ నెంబర్‌ను అప్
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో లక్షలాది మంది వాట్సాప్ నంబర్లకు ఏపీకే ఫైళ్లు పంపి దోచుకుంటున్నారు. ‘ఈ రోజు అర్ధరాత్రిలోపు మీ ఆధార్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోండి. లేదంటే మీ ఎస్బీఐ ఖాతా నిలిచిపోతుంది’ అంటూ హెచ్చరికతో కూడిన సందేశాన్ని సైబర్ కేటుగాళ్లు పంపారు. ఆధార్ అప్‌డేట్ కోసం ‘ఎస్బీఐ ఆధార్ అప్‌డేట్ యాప్’ పేరుతో ఒక ఏపీకే ఫైల్ లింక్‌ను జతచేశారు. ఇది నిజమైన సందేశమని నమ్మిన చాలామంది, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఈ లింక్‌ను క్లిక్ చేసి మోసపోయారు. ఈ సందేశాన్ని పొరపాటున తెరిచిన వారి ఫోన్లలోని వాట్సాప్ గ్రూపులన్నింటిలోకి హ్యాకర్లు సులువుగా ప్రవేశించారు. తెలంగాణకు చెందిన జర్నలిస్టులు, మంత్రులు, చివరికి సీఎంఓ వాట్సాప్ గ్రూపులను కూడా వదల్లేదు. అనేక గ్రూపుల అడ్మిన్లను కంట్రోల్ తీసుకుని, వాటి డీపీలను ఎస్బీఐ లోగోతో మార్చేశారు. ఓ జర్నలిస్టుకు వచ్చిన సందేశాన్ని క్లిక్ చేయడంతో ఆయన ఫోన్‌లోని అన్ని గ్రూపులకు ఈ మాల్‌వేర్ వ్యాపించిందని తెలిసింది.