News2nd Nov 04:54 PMSunil Byrisetty1 min read
కేంద్ర బృందంతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు
తుఫాను నష్టంపై అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు, త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించేలా చూడాలని కేంద్ర బృందాన్ని కోరారు. అర్నబ్ తుఫాను కారణంగా
తుఫాను నష్టంపై అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు, త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించేలా చూడాలని కేంద్ర బృందాన్ని కోరారు. అర్నబ్ తుఫాను కారణంగా ఏపీకి వాటిల్లిన నష్టం ప్రాథమికంగా రూ.4526 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. తుఫాను నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను కేంద్రానికి వెంటనే పంపించగలిగామన్నారు. త్వరితగతిన రాష్ట్రానికి కలిగిన నష్టం అంచనా వేసిన కేంద్ర బృందానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నానన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రంతో పాటు వివిధ టెక్నాలజీ అనుసంధానంతో ప్రాణ నష్టాన్ని భారీగా తగ్గించగలిగామని పేర్కొన్నారు. విద్యుత్, రహదారులు లాంటి మౌలిక సదుపాయాలు తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్నాయన్నారు. హుద్ హుద్, తిత్లీ, మోంథా లాంటి తుఫాన్లు ఏపీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయని వివరించారు.