News27th Oct 05:06 PMSunil Byrisetty1 min read
ఆర్నబ్ విపత్తు వేళ మనమిత్రను డీపీ స్టేటస్‌గా పెట్టుకుందాం
మిత్రులారా చిన్న విన్నపం అర్నబ్ తుపాన్ తీవ్రత దృష్ట్యా అత్యవసర సహాయం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు
మిత్రులారా చిన్న విన్నపం
అర్నబ్ తుపాన్ తీవ్రత దృష్ట్యా అత్యవసర సహాయం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది. ఈ నెంబర్లు అందరూ ఉపయోగించుకోవాల్సిన అవసరముంది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో నెటిజన్లు, ప్రజలు ఈ రోజు రేపు తమ వాట్సాప్ ల్లో తమ గ్రూపులు లేదా వ్యక్తిగత డీపీ స్టేటస్‌గా ఉపయోగిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇదేమీ నిబంధన కాదు. పూర్తీ స్వచ్ఛందం. అత్యవసర వేళ ఈ నెంబర్లు చాలా మందికి గుర్తుకు రాకపోవచ్చు. కాబట్టి ఈ నెంబర్లను డీపీ స్టేటస్‌గా పెడితే అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విపత్తు వేళ ఎలాంటి సమస్యలు వస్తాయో తెలీదు. కాబట్టి సమస్య ఏర్పడినప్పడు ఆ సమస్యను తక్షణం అధికారులకు తెలియజేసి సాయం పొందడానికి ఈ నెంబర్లు ఎంతో ఉపయోగపడతాయి. ఇది కేవలం చిరు విన్నపం మాత్రమే. అని ప్రభుత్వ రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ సూచించింది.