News28th Oct 11:56 AMSunil Byrisetty1 min read
ఆర్జబ్ తుఫాన్.. తీరం కకావికలం
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ విధ్వంసాన్ని సృష్టించింది. వేకువ జామున 2:30 నుంచి 3 గంటల సమయంలో నరసాపురం- యానాం సమీపంలో తీరాన్ని తాకిన తుఫాన్ తీవ్రత అంచనాలకు మించిన స్థాయిలో కని
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ విధ్వంసాన్ని సృష్టించింది. వేకువ జామున 2:30 నుంచి 3 గంటల సమయంలో నరసాపురం- యానాం సమీపంలో తీరాన్ని తాకిన తుఫాన్ తీవ్రత అంచనాలకు మించిన స్థాయిలో కనిపించింది. ఉత్తరాంధ్ర, కోస్తా తీరం మొత్తం అల్లకల్లోలమైంది. భారీగా కోతకు గురైంది. అనేక చోట్ల సముద్రం కొన్ని మీటర్ల పాటు ముందుకు చొచ్చుకొచ్చింది. కోస్తా జిల్లాలకు కంటి మీద కునుకులేకుండా చేసింది. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. తీరంలో అలలు 1.5 నుంచి 2.5 మీటర్ల ఎత్తువరకు ఎగిసిపడ్డాయి. ల్యాండ్ ఫాల్ ప్రక్రియ మూడు గంటల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గంటకు 125-135కిమీ వేగంతో ఈదురుగాలులు నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఈదురుగాలుల తీవ్రత అధికంగా కనిపించింది.