News28th Oct 11:12 AMSunil Byrisetty1 min read

తుఫాన్ ఎఫెక్ట్.. ఆస్పత్రులకు 787మంది గర్భిణులు

మొంథా తుఫాను నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. డెలివరీ డేట్‌కు వారం రోజులు మాత్రమే సమయం ఉన్న మహిళలను స్థానిక వైద్య అధికారులు గుర్తించి, ఏరియా, జిల్లా ప్రభుత్వ ఆసు

తుఫాన్ ఎఫెక్ట్.. ఆస్పత్రులకు 787మంది గర్భిణులు
మొంథా తుఫాను నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. డెలివరీ డేట్‌కు వారం రోజులు మాత్రమే సమయం ఉన్న మహిళలను స్థానిక వైద్య అధికారులు గుర్తించి, ఏరియా, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. తుఫాను ప్రభావిత 17 జిల్లాల్లో ఈ తరలింపు చర్యలు చేపట్టారు. గర్భిణులలో ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్న మహిళలకు సంబంధించి వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో 240 మంది, ఏలూరు జిల్లాలో 171, కోనసీమ జిల్లాలో 150 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 142 మంది గర్భిణీలను ఆస్పత్రులకు తరలించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆశ్రయాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇప్పటివరకు 551 శిబిరాలను ఏర్పాటు చేశామని.. ప్రతి శిబిరంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి, ఒక ఏఎన్ఎం, ఆశా కార్యకర్త అందుబాటులో ఉంటారని వెల్లడించారు.
Andhra Pradesh
Cyclone Montha
Pregnant Women
Health Department
Medical Camps
Government Hospitals
Krishna District
Eluru
Konaseema
East Godavari
విపత్తు నిర్వహణ
మంత్రి సత్యకుమార్
ప్రజా ఆరోగ్యం
ప్రసూతి సేవలు
అత్యవసర చర్యలు
Scroll for the next article