News28th Oct 11:16 AMSunil Byrisetty1 min read
తీవ్రతుపానుగా బలపడిన మొంథా
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా మొంథా బలపడింది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో తుపాన్ కదిలింది . ప్రస్తుతానికి మచిలీపట్నంకి 190 కిమీ, కాకినాడకి 270 కిమీ, విశాఖపట్నంకి
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా మొంథా బలపడింది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో తుపాన్ కదిలింది . ప్రస్తుతానికి మచిలీపట్నంకి 190 కిమీ, కాకినాడకి 270 కిమీ, విశాఖపట్నంకి 340కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈరోజు రాత్రికి కాకినాడ- మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం ఉంది.
తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కనుక ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం మీతో ఉంది భయాందోళనలకు గురికావొద్దని భరోసా కల్పించారు.