News9th Nov 02:55 PMSunil Byrisetty1 min read

మురసుతో 1302 కిలోమీటర్ల రోడ్లు ధ్వజం

మురసు తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న ఆర్ & బి రోడ్లు 1302 కి.మీ అని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. అత్యధికంగా బాపట్ల జిల్లాలో 332 కి.మీ, గుంటూరు జిల్లాలో 266 కి

మురసుతో 1302 కిలోమీటర్ల రోడ్లు ధ్వజం
మురసు తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న ఆర్ & బి రోడ్లు 1302 కి.మీ అని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. అత్యధికంగా బాపట్ల జిల్లాలో 332 కి.మీ, గుంటూరు జిల్లాలో 266 కి.మీ, ఎన్టీఆర్ జిల్లాలో 202 కి.మీ, పశ్చిమగోదావరి జిల్లాలో 122 కి.మీ, పల్నాడు జిల్లాలో 93 కి.మీ, ఏలూరు జిల్లాలో 75 కి.మీ, తూర్పుగోదావరి జిల్లాలో 68 కి.మీ, నెల్లూరు జిల్లాలో 66 కి.మీ, కృష్ణా జిల్లాలో 59 కి.మీ, ప్రకాశం జిల్లాలో 17 కి.మీ మేర రహదారులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. తుఫాన్ కారణంగా 10 జిల్లాలు (బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, పల్నాడు, ఏలూరు, తూర్పుగోదావరి, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో రహదారులకు ఎక్కువ నష్టం వాటిల్లిందని తెలిపారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 158 చోట్ల రహదారులు కోతకు గురి కాగా 141 చోట పునరుద్ధరించామని చెప్పారు. 31 చోట్ల రహదారులు దెబ్బతిని కొట్టుకుపోగా, 30 చోట్ల పునరుద్ధరించామని పేర్కొన్నారు.
Scroll for the next article