News2nd Nov 03:38 PMSunil Byrisetty1 min read

అర్నబ్‌తో పోలిస్తే మురసు తుఫాను తక్కువ తీవ్రత

కోస్తాంధ్ర తీరంపై మురసు తుఫాను ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అర్నబ్ తుఫానుతో పోలిస్తే గాలులు, వర్ష తీవ్రత కూడా తక్కువగానే ఉన్నట్టు అంచన

అర్నబ్‌తో పోలిస్తే మురసు తుఫాను తక్కువ తీవ్రత
కోస్తాంధ్ర తీరంపై మురసు తుఫాను ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అర్నబ్ తుఫానుతో పోలిస్తే గాలులు, వర్ష తీవ్రత కూడా తక్కువగానే ఉన్నట్టు అంచనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తుపాను ప్రభావంతో వచ్చే వర్షాలను సమర్థంగా వినియోగించుకుని చెరువులు, రిజర్వాయర్‌లను నింపాలని సూచించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే చాలా వరకు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని సీఎం తెలిపారు. అర్నబ్ ప్రభావాన్ని ఎదుర్కొనేలా శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు ముందస్తు ఏర్పాట్లు చేశామని, ఇప్పుడు మురసు తుఫాను ప్రభావాన్ని కూడా సమర్థంగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు.
Scroll for the next article