News19th May 12:02 PMSunil Byrisetty1 min read
తెలుగు రాష్ట్రాలకు శక్తి ఎఫెక్ట్!
తెలుగు రాష్ట్రాల్లో రానున్న వారం రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీకి శక్తి తుపాను ఉందని పేర్కొంది. దక్షిణ మధ్య బం
తెలుగు రాష్ట్రాల్లో రానున్న వారం రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీకి శక్తి తుపాను ఉందని పేర్కొంది.
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతోంది.
రానున్న రోజుల్లో ఇది తుపానుగా మారి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
నేటి నుంచి ఒక వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
30-50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ ప్రకటనలో పేర్కొంది