News27th Oct 04:49 PMSunil Byrisetty1 min read
ఓడరేవుల్లో తుపాను సంకేతాలు
ఓడరేవుల్లో ఎగురవేసే అధికారిక తుపాను సంకేతాలు 1 నుండి 11 వరకు ఉంటాయి. పరిస్థితిని బట్టి ఇవి మారుతుంటాయి. భారత వాతావరణ శాఖ ప్రమాద తీవ్రతను బట్టి ఓడరేవుల్లో ప్రత్యేకమైన నెంబర్లతో కూడి
ఓడరేవుల్లో ఎగురవేసే అధికారిక తుపాను సంకేతాలు 1 నుండి 11 వరకు ఉంటాయి. పరిస్థితిని బట్టి ఇవి మారుతుంటాయి.
భారత వాతావరణ శాఖ ప్రమాద తీవ్రతను బట్టి ఓడరేవుల్లో ప్రత్యేకమైన నెంబర్లతో కూడిన జెండాలను ఏర్పాటు చేస్తుంది.
సిగ్నల్ 1 ..సముద్రంలో సుదూరంగా అల్పపీడనం ఏర్పడింది. ప్రమాదం తక్కువ.
సిగ్నల్ 2 .. అల్పపీడనం కాస్త బలపడి తుపానుగా మారింది. నౌకలు జాగ్రత్తగా ఉండాలి.
సిగ్నల్ 3 ... స్థానికంగా బలమైన గాలులతో కూడిన వాతావరణం ఉంది. ఓడరేవుకు స్వల్ప ముప్పు ఉంటుంది.
సిగ్నల్ 4 ..సముద్రంలో తీవ్ర వాయుగుండం ఉంది. తీరంలోని ఓడలకు ప్రమాదం పొంచి ఉంది.
తుఫాను ఓడరేవుకు ఎడమ వైపు 5, కుడి వైపు 6 లేదా నేరుగా రేవు పై నుంచే 7తీరం దాటే అవకాశం ఉంది.
సిగ్నల్ 8, 9, 10 తీవ్ర ప్రమాద సూచిక గా తెలియజేస్తుంది.తీవ్రమైన లేదా అతి తీవ్రమైన తుఫాను ఓడరేవుకు ఎడమ వైపు 8, కుడి వైపు 9 లేదా నేరుగా 10 దాటబోతోంది. భారీ నష్టం వాటిల్లవచ్చు.
సిగ్నల్ 11 ..వాతావరణ కేంద్రంతో ఓడరేవుకు సంబంధాలు తెగిపోయాయని, వాతావరణం అత్యంత భయంకరంగా ఉందని అర్థం.