News23rd Sep 03:49 PMSunil Byrisetty1 min read
వాయు‘గండం’.. భారీ వర్షాలు
ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. గురువారం నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నాటికి అది వాయుగుండంగా మారుతుందని అంచన
ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. గురువారం నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నాటికి అది వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. మంగళవారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.