News30th Nov 09:00 AMSunil Byrisetty1 min read
గుడివాడలో సందడిగా సైక్లోథాన్ 2025 సైకిల్ ర్యాలీ
గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో.. సైకిల్ తొక్కు బ్రో’ నినాదంతో సైక్లోథాన్- 2025 సైకిల్ ర్యాలీ ఆదివారం ఉదయం సందడి వాతావరణ
గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో.. సైకిల్ తొక్కు బ్రో’ నినాదంతో సైక్లోథాన్- 2025 సైకిల్ ర్యాలీ ఆదివారం ఉదయం సందడి వాతావరణంలో జరిగింది. ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు యువతతో కలిసి.. ఈగల్ టీం ఐజి ఆకె రవికృష్ణ, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దంపతులు, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పలువురు ప్రముఖులు సైకిల్ తొక్కుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఐజి రవి కృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామన్నారు. తాము పట్టుకున్న అనేక కేసుల్లో చెడు స్నేహాలతో డ్రగ్స్ బారిన పడి ఎందరో అమాయకులు తమ జీవితాలను నాశనం చేసుకున్నవి గుర్తించామని చెప్పారు. మంచి అలవాట్లు.. చెడు అలవాట్లు ఈ రెండిటికి మధ్య వ్యత్యాసాన్ని చిన్నతనం నుంచే గుర్తించాలన్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. డ్రగ్స్ సమాచారం తెలిస్తే ప్రభుత్వ టోల్ ఫ్రీ 1972 నంబర్ కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.