News8th Oct 10:59 AMSunil Byrisetty1 min read

పూలింగ్ పై ప్రతిరోజు నివేదిక

అమరావతి రెండో దశ పూలింగు పరిధిలో ఉన్న ఇన్నర్ రింగురోడ్డు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూములు వెంటనే అప్పగించాలని, సమీకరణ ప్రక్రియను నెలాఖరులోపు పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశ

పూలింగ్ పై ప్రతిరోజు నివేదిక
అమరావతి రెండో దశ పూలింగు పరిధిలో ఉన్న ఇన్నర్ రింగురోడ్డు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూములు వెంటనే అప్పగించాలని, సమీకరణ ప్రక్రియను నెలాఖరులోపు పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. పూలింగు అంశంపై ప్రతిరోజు సమీక్ష జరిపి తనకు వివరాలు అందచేయాలని చెప్పారు. పెద్దమద్దూరు 76 శాతంతో మొదటిస్థానంలో ఉందని, 60 శాతంతో యండ్రాయి వేగంగా పూలింగు సాగుతోందని మంత్రికి తెలిపారు. రెండోదశలో రైతులు ముందుకు వచ్చి పూలింగుకు ఇస్తామన్నా ఇప్పటి వరకూ అనుకున్నస్థాయిలో పనులు జరగకపోవడంపై మంత్రి కొంత అసహనం వ్యక్తం చేశారు. ఇక ముందు అలా జరగడానికి వీల్లేదని, పూలింగు వేగవంతం చేయాలని తెలిపారు. ఇన్నర్ రింగురోడ్డు ప్రక్రియకు వీలుగా ఈనెలాఖరులోపు భూములు అప్పగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రాధాన్యతా ప్రాజెక్టులు కావడంతో జాప్యం వద్దని, పూలింగు ఎందుకు ఆలస్యం అవుతోందని, రైతులు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారనే అంశాలపై ప్రతిరోజూ చర్చించాలని, సంప్రదింపులు జరపాలని కోరారు. అలాగే మొదటిదశలో పూలింగులో ఇంకా సమీకరణకు ఇవ్వని భూముల అంశాలపై ఆయా విభాగాల అధికారులతో చర్చించారు. రోడ్లకు ఇవ్వాల్సిన భూములు ఎక్కడైనా పెండింగ్లో ఉంటే వెంటనే వాటిని సమీకరణ కింద తీసుకోవడం రైతులను ఒప్పించాలని సూచించారు.
Scroll for the next article