News16th Nov 04:39 PMSunil Byrisetty1 min read

దలైలామా జీవిత కథ ఢిల్లీలో ఆవిష్కరణ

పద్నాలుగో దలైలామా తొలి హిందీ మూల జీవిత చరిత్ర ఆవిష్కరణతో సమకాలీన భారత సాహిత్యానికి కొత్త బలం చేకూరింది. ఈ పుస్తకాన్ని ప్రఖ్యాత జర్నలిస్ట్, ప్రముఖుల జీవితకథల రచయిత డాక్టర్‌ అరవింద్‌

దలైలామా జీవిత కథ ఢిల్లీలో ఆవిష్కరణ
పద్నాలుగో దలైలామా తొలి హిందీ మూల జీవిత చరిత్ర ఆవిష్కరణతో సమకాలీన భారత సాహిత్యానికి కొత్త బలం చేకూరింది. ఈ పుస్తకాన్ని ప్రఖ్యాత జర్నలిస్ట్, ప్రముఖుల జీవితకథల రచయిత డాక్టర్‌ అరవింద్‌ యాదవ్‌ రాశారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగిన విశేష కార్యక్రమంలో ఈ గ్రంథం విడుదలైంది. ప్రసిద్ధ రాజనీతజ్ఞుడు, పండితుడు, రచయిత పద్మవిభూషణ్‌ డాక్టర్‌ కరణ్‌సింగ్‌ దేశ రాజధానిలో దలైలామా జీవిత చరిత్రను ఆవిష్కరించారు. ఈ కొత్త పుస్తకం తొలి ప్రతిని పద్మవిభూషణ్‌ డాక్టర్‌ మురళీమనోహర్‌ జోషీకి అందజేశారు. ఢిల్లీ టిబెట్‌ హౌస్‌ డైరెక్టర్‌ గెషే దోర్జీ దందూల్‌ కూడా ఈ కార్యక్రమానికి దలైలామా అధికార ప్రతినిధిగా హాజరయ్యారు. సభకు అధ్యక్షత వహించిన డా.కరణ్‌సింగ్‌ ప్రసంగిస్తూ బౌద్ధ గురువు కొత్త జీవిత చరిత్రను పరిచయం చేశారు. దలైలామా జీవితాన్ని, బోధనలను కళ్లకు కట్టే ఈ కొత్త జీవితకథ భారత సాహిత్యానికి గొప్ప సంపద అని, భిన్న ధర్మాల గురించి అనేక వర్గాల ప్రజల అవగాహనను పెంచుతుందని స్పష్టంచేశారు. దలైలామా జీవితం ఒక ఆధ్యాత్మిక నాయకుని జీవనయానాన్ని మాత్రమే చెప్పదనీ, శాంతి, కరుణ, మానవ విలువలకు సంబంధించి ఇది విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రజలకు గొప్ప సందేశం ఇస్తుందని కరణ్‌సింగ్‌ పేర్కొన్నారు. టిబెట్‌ బౌద్ధ గురువుతో తనకు వ్యక్తిగతంగా ఉన్న బంధం గురించి ప్రస్తావిస్తూ, 1956లో తాము మొదటిసారి కలుసుకున్నప్పటి నుంచీ తాము మంచి స్నేహితులుగా కొనసాగుతున్నామని ఆయన అన్నారు. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తమను పరిచయం చేశారని ఆయన తెలిపారు. ఈ పుస్తక రచనలో డా.అరవింద్‌ యాదవ్‌ విశేష కృషిని, సాహిత్య సేవలో అంకితభావాన్ని డా.సింగ్‌ ప్రశంసించారు.
Dalai Lama
Hindi Biography
Book Launch
New Delhi
Dr Aravind Yadav
Dr Karan Singh
Murli Manohar Joshi
Tibet House
బౌద్ధ గురువు
పుస్తక ఆవిష్కరణ
భారత సాహిత్యం
ఆధ్యాత్మిక నాయకుడు
Scroll for the next article