News29th Aug 12:38 PMSunil Byrisetty1 min read
నెల్లూరుకు 'డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ'
'డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ' విజయవాడ నుంచి నెల్లూరు వచ్చింది. కమిటీ ఛైర్మన్ గోపాల్‌రెడ్డి, నిపుణులు వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ నెల్లూరు చేరుకున్నారు. ఈరోజు, రేపు 'సోమశిల' జలాశయాన్ని
'డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ' విజయవాడ నుంచి నెల్లూరు వచ్చింది. కమిటీ ఛైర్మన్ గోపాల్‌రెడ్డి, నిపుణులు వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ నెల్లూరు చేరుకున్నారు. ఈరోజు, రేపు 'సోమశిల' జలాశయాన్ని నిపుణుల కమిటీ పరిశీలించనుంది. రెండు రోజుల పాటు డ్యామ్ భద్రత, నాణ్యత స్థితిగతులు పరిశీలన చేయనుంది. పరిశీలన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందజేస్తుంది. అనంతరం ఈ నెల 31, సెప్టెంబర్ 1న 'కండలేరు' జలాశయాన్ని కమిటీ పరిశీలించనుంది.