Telangana24th Sep 05:40 PMSunil Byrisetty1 min read

దానం.. కాస్త నిదానం: సుప్రీం చమత్కారం!

తెలంగాణ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఇచ్చిన అనర్హత వేటునే సమర్థించింది. అలాగే పార్టీల మార్పుపైనా చమత్కరించింది. దానం ఆయా రా

దానం.. కాస్త నిదానం: సుప్రీం చమత్కారం!
తెలంగాణ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఇచ్చిన అనర్హత వేటునే సమర్థించింది. అలాగే పార్టీల మార్పుపైనా చమత్కరించింది. దానం ఆయా రాం, గయా రాం లాగా పార్టీలు మారడంపై వ్యాఖ్యలు చేసింది. అయితే సుప్రీం తీర్పును దానం నాగేందర్ స్వాగతించారు. ఉపఎన్నికల్లో తాను బరిలో దిగడం ఖాయమని స్పష్టం చేస్తూనే.. ఏ పార్టీ తరపున పోటీ చేయనున్నారనే అంశంపై షెడ్యూల్ విడుదలయ్యాక స్వయంగా ప్రకటిస్తానని తేల్చి చెప్పారు. ఉపఎన్నికలో గెలిచినా, ఓడినా తనకు కేబినెట్ బెర్త్ ఖాయం చేస్తేనే కాంగ్రెస్ టికెట్‌పై బరిలోకి దిగుతానని, లేదంటే ప్రత్యామ్నాయ దారులు చూసుకుంటాననే పరోక్ష హెచ్చరికను ఆయన ఢిల్లీ, గాంధీభవన్ వర్గాలకు పంపినట్లు ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీ-ఫారంతో ఎంపీగా పోటీ చేయకపోతే ఆయనపై అనర్హత వేటు పడే అవకాశమే ఉండేది కాదు. కాంగ్రెస్ అవసరాల కోసం రిస్క్ చేసి ఎమ్మెల్యే పదవిని పోగొట్టుకున్న నాయకుడిని ఇప్పుడు ఆ పార్టీ ఎలా వదులుకుంటుందనేది ప్రధాన ప్రశ్నగా మారింది.
Scroll for the next article