News21st Jul 09:37 AMSunil Byrisetty1 min read

స్వచ్ఛ విజయవాడపై డ్యాన్స్ పోటీ!

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛ విజయవాడ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన పెంచేందుకు డ్యాన్స్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.ల

స్వచ్ఛ విజయవాడపై డ్యాన్స్ పోటీ!
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛ విజయవాడ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన పెంచేందుకు డ్యాన్స్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. హరిత బెరం పార్క్ లో డాన్స్ కాంపిటీషన్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొని పోటీలకు సంబంధించిన పోస్టర్ ను లాంచ్ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఆదివారం జూలై 27న హరిత బెరం పార్క్ లో డాన్స్ కాంపిటీషన్స్ ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు. ప్రతి వయసు గల వారికి వివిధ కేటగిరీలు ఉంటాయని, మొదటి క్యాటగిరిలో 6 కంటే తక్కువ వయసు, ఏడు నుంచి పది వయసుగల వారు రెండో కేటగిరీ, 11 నుండి 15 వయసు గల వారు మూడో క్యాటగిరి, 16 సంవత్సరాలు కంటే ఎక్కువగా ఉన్నవారు నాలుగో కేటగిరీలో డాన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోలో, గ్రూప్ పర్ఫామెన్స్, క్లాసికల్, జనరల్ కేటగిరిలలో ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు విజయవాడ నగర పాలక సంస్థ వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్ లో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ ను క్లిక్ చేసి, రిజిస్టర్ చేసుకోగలరని తెలిపారు.
Andhra Pradesh news
Swachh Vijayawada
Dance Competition
NTR District Collector
Haritha Beram Park
Plastic Ban
Public Awareness
Dance Contest 2025
Clean City Campaign
Environmental Awareness
స్వచ్ఛ విజయవాడపై డ్యాన్స్ పోటీ
Scroll for the next article