Spiritual1st Oct 09:45 AMSunil Byrisetty1 min read

ఇంద్రకీలాద్రిపై దసరా.. లోకేష్ కు ఆహ్వానం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఆ ఉత్సవాలకు రావాలని విద్య, ఐటీ శాఖల మ

ఇంద్రకీలాద్రిపై దసరా.. లోకేష్ కు ఆహ్వానం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఆ ఉత్సవాలకు రావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ను కలిసిన ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రి లోకేష్ కు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. మంత్రి లోకేష్ ను కలిసి ఉత్సవాలకు ఆహ్వానించిన వారిలో దుర్గగుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్, బోర్డు సభ్యులు ఉన్నారు.
Scroll for the next article