Spiritual18th Oct 04:08 PMSunil Byrisetty1 min read

శ్రీశైలంలో కన్నుల పండువగా దసరా

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారాలు నిర్వహించారు

శ్రీశైలంలో కన్నుల పండువగా దసరా
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారాలు నిర్వహించారు. చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానాలు, చండీ పారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు జరిపించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. రుద్రహోమం, రుద్రయాగాంగ జపాలు, రుద్ర పారాయణలు కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం జపాలు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీహోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాత్రి 9 గంటల నుంచి అమ్మవారి ఆస్థానసేవ, సువాసినీ పూజలు, రాత్రి 10 గంటలకు కాళరాత్రి పూజలు జరగనున్నట్లు వివరించారు. దసరా మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ కుమారీ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజల్లో రెండేళ్ల నుంచి పదేళ్ల వయసున్న బాలికలకు పూలు, పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించి పూజలు చేస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో కుమారీ పూజను ముఖ్యమైన సంప్రదాయంగా భావిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
Scroll for the next article