News1st Oct 10:50 AMSunil Byrisetty1 min read
చిన్న కాంట్రాక్టర్‌లకు దసరా కానుక
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గత టీడీపీ హయాంలో అంటే 2014-19 మధ్య కాలంలో రూ.5 కోట్ల లోపు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గత టీడీపీ హయాంలో అంటే 2014-19 మధ్య కాలంలో రూ.5 కోట్ల లోపు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని ఆర్ధిక శాఖ నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ సందర్భంగా రూ.5 లక్షల్లోపు చిన్న పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు వెంటనే అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం గత ఆరేళ్లుగా తమ బిల్లుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది కాంట్రాక్టర్లకు ఊరటనివ్వనుంది.
ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలపై స్పందించిన ఆర్థిక శాఖ, బకాయిల చెల్లింపులకు సంబంధించిన చర్యలను వేగవంతం చేసింది. బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కావడంతో దాదాపు రూ.400 కోట్ల చెల్లింపులు త్వరలోనే జరగనున్నాయి.