Spiritual28th Jul 12:09 PMSunil Byrisetty1 min read
సెప్టెంబర్ 22 నుంచి దసరా ఉత్సవాలు
శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏడాది లానే విశేషంగా నిర్వహిస్తామని విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ స్థానాచార్యులు శివ ప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలు 11 రోజులు వచ్చాయన్నారు. 22వ తేదీ
శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏడాది లానే విశేషంగా నిర్వహిస్తామని విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ స్థానాచార్యులు శివ ప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలు 11 రోజులు వచ్చాయన్నారు.
22వ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం
23వ తేదీ శ్రీ గాయత్రి దేవి అలకారం
24వ తేదీ శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం
25 వ తేదీ శ్రీ కాత్యాయిని దేవి అలంకారం
26 వ తేదీ శ్రీ మహా లక్ష్మీ దేవి అలంకారం
27 వ తేదీ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం
28 వ తేదీ శ్రీమహా చండీ దేవి అలంకారం
29 తేదీ శ్రీ మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవి అలంకారం
30 వ తేదీ శ్రీ దుర్గా దేవి అలంకారం
1వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం
2 వ తేదీ విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం చేయనున్నట్లు వెల్లడించారు. 11 రోజులు 11 దివ్య అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. 29 న మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. 2వ తేదీ విజయదశమి రోజున తెప్పోత్సవం ఉంటుందని తెలిపారు.