Technology4th Aug 11:12 AMSunil Byrisetty1 min read

డేటా సెంటర్లలో 4 లక్షల ఉద్యోగాలు

భారతదేశంలో డేటా సెంటర్ల రంగం భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించనుందని అంచనా. 2030 నాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందని రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ స్క్వ

డేటా సెంటర్లలో 4 లక్షల ఉద్యోగాలు
భారతదేశంలో డేటా సెంటర్ల రంగం భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించనుందని అంచనా. 2030 నాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందని రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ స్క్వేర్ యార్డ్స్ తాజా నివేదికలో పేర్కొంది. ఇందులో ప్రత్యక్ష ఉద్యోగాలు 27,000 కాగా, పరోక్ష ఉద్యోగాలు 4.06 లక్షలు ఉంటాయని అంచనా వేసింది. రాబోయే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 250కి పైగా డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి కలిపి 9,030 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. డేటా సెంటర్ల విస్తరణ వల్ల విద్యుత్ మౌలిక వసతులు, లాజిస్టిక్స్, వాణిజ్య నిర్మాణాలు, సంబంధిత సేవల రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయని నివేదిక పేర్కొంది. అలాగే, ఈ వ్యవస్థ వల్ల నివాస రియల్ ఎస్టేట్‌కు కూడా డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. అయితే నీటి వినియోగం పెరగడం, వేడిమిని ఉత్పత్తి చేయడం వంటి ప్రతికూలాంశాలపై ఎలాంటి అభిప్రాయాన్ని ప్రకటించలేదు.
Technology
Data Centres
India
Jobs
Employment
Square Yards
మౌలిక వసతులు
డిజిటల్ ఎకానమీ
పెట్టుబడులు
రియల్ ఎస్టేట్
Scroll for the next article