Spiritual27th Sep 09:12 AMSunil Byrisetty1 min read

ఆరో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ

దసరా శరన్నవరాత్రుల్లో ఆరో రోజైన శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గమ్మను దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. జై దుర్గా జై జై ద

ఆరో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ
దసరా శరన్నవరాత్రుల్లో ఆరో రోజైన శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గమ్మను దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. జై దుర్గా జై జై దుర్గ అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. అమ్మను ఈరోజు సేవిస్తే సర్వ విధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అత్యున్నత స్థితి లభిస్తుంది. ప్రకృతి శక్తికి ప్రతీక లలితాదేవి. చిరుమందహాసంతో.. చెరుకు గడను చేతపట్టుకుని.. పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. 
Vijayawada
Goddess Durga
Dasara
Navaratri
Durga Devi
Sri Lalita Tripura Sundari
Indrakeeladri
Spirituality
Hindu Festivals
Devotion
Sharannavaratri
లలితా త్రిపురసుందరి
ఇంద్రకీలాద్రి
ఆధ్యాత్మికం
Scroll for the next article