News16th Sep 04:14 PMSunil Byrisetty1 min read

మిరుమిట్లు గొలిపేలా విజయవాడ ఉత్సవ్

దేశ‌వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ద‌స‌రా అంటే విజ‌య‌వాడకు వెళ్లాల‌నిపించేలా విజ‌య‌వాడ ఉత్స‌వ్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హిస్తామ‌ని, ఈ ఫెస్టివ‌ల్ ను విజ‌య‌వంతం చేసేందుకు త‌మ వంతు స‌హ‌

మిరుమిట్లు గొలిపేలా విజయవాడ ఉత్సవ్
దేశ‌వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ద‌స‌రా అంటే విజ‌య‌వాడకు వెళ్లాల‌నిపించేలా విజ‌య‌వాడ ఉత్స‌వ్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హిస్తామ‌ని, ఈ ఫెస్టివ‌ల్ ను విజ‌య‌వంతం చేసేందుకు త‌మ వంతు స‌హ‌కారం అందిస్తామ‌ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌, స‌మాచార శాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర తెలిపారు. సొసైటీ ఫ‌ర్ వైబ్రెంట్ విజ‌య‌వాడ సంస్థ ఆధ్వ‌ర్యంలో నగరంలోని ఫార్చ్యూన్ మురళి హోటల్లో మంగళవారం విజయవాడ ఉత్సవ్ సన్నాహక సమావేశం జ‌రిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా మంత్రుల‌తో పాటు పొలిట్ బ్యూరో స‌భ్యులు వ‌ర్ల రామ‌య్య పాల్గొన‌గా, స్వ‌చ్చాంధ్ర కార్పొరేష‌న్ చైర్మ‌న్ కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ స‌భాధ్య‌క్ష‌త వ‌హించారు. విజ‌య‌వాడ ఉత్స‌వ్ ను విజ‌య‌వంతం చేసేందుకు ప్ర‌జా ప్ర‌తినిధులు, న‌గ‌ర ప్ర‌ముఖులు చ‌ర్చించారు. అలాగే స‌ల‌హాలు , సూచ‌న‌లు కూడా అందించారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ జ‌న్మదిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ కేక్ క‌ట్ చేయ‌గా ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.
Andhra Pradesh Events
Vijayawada Utsav
Dasara Festival
Vibrant Vijayawada
Satya Kumar Yadav
Kollu Ravindra
Varla Ramaiah
Pattabhiram
Cultural Festival
మిరుమిట్లు గొలిపేలా విజయవాడ ఉత్సవ్
Scroll for the next article