News14th Apr 09:19 AMSunil Byrisetty1 min read
కొడుకు కోసం తలనీలాలిచ్చిన పవన్ సతీమణి!
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్.. స్వల్ప గాయాలతో సురక్షితం
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్.. స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే.
దీంతో పవన్ సతీమణి అనా కొణిదెల తిరుమల శ్రీవారిని దర్శనానికి వెళ్లి తలనీలాలు సమర్పించారు.
వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు.
టీటీడీ నియమాల ప్రకారం అన్య మతస్థులు తిరుమల వెంకన్న దర్శనానికి వస్తే శ్రీవారిపై నమ్మకం ఉందంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ మేరకు అన్నా కొణిదెల గాయత్రి సదనంలో డిక్లరేషన్ పత్రాలపై సైన్ చేశారు.
ఆదివారం రాత్రి అనా కొణిదెల వరాహ స్వామిని దర్శించుకున్నారు.
పవన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో.. తిరుమలకు అన్నా కొణిదెల ఒక్కరే వెళ్లారు.