News27th Mar 03:08 PMSunil Byrisetty1 min read

ఉచిత సిలిండర్ బుక్ చేసుకోండి.. మార్చి 31 గడువు

ఏపిలో కూటమి ప్రభుత్వం ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకుని నగదు చెల్లిస్తే, తర్వాత సబ్సిడీ కింద మొత్తం డబ్బు ఖాతాలో జమ అ

ఉచిత సిలిండర్ బుక్ చేసుకోండి.. మార్చి 31 గడువు
ఏపిలో కూటమి ప్రభుత్వం ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకుని నగదు చెల్లిస్తే, తర్వాత సబ్సిడీ కింద మొత్తం డబ్బు ఖాతాలో జమ అవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులందరూ మొదటి సిలిండర్ బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఏడాదికి 3 ఫ్రీ సిలిండర్ల పథకంలో ఫస్ట్ సిలిండర్ కోసం ఈ నెల 31 వరకు గడువు ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే 98 లక్షల మంది సిలిండర్ అందుకున్నారని తెలిపారు. ఏప్రిల్ నుంచి జూలై , ఆగస్ట్ నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి నెలల మధ్య బుకింగ్ కి అవకాశం ఉంటుందన్నారు. రేషన్ కార్డు ఉన్నవారంతా ఉచిత సిలిండర్‌కు అర్హులని పేర్కొన్నారు.
Free Gas Cylinder
Andhra Pradesh
Deepam 2 Scheme
ప్రభుత్వం
Scroll for the next article