News18th Nov 11:19 AMSunil Byrisetty1 min read

మారేడుమిల్లిలో మరణ మృదంగం

అల్లూరి జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అటవీప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేతలు ఆశ్రయం పొందుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు.

మారేడుమిల్లిలో మరణ మృదంగం
అల్లూరి జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అటవీప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేతలు ఆశ్రయం పొందుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు - మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో తుపాకులు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం టైగర్ జోన్ లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మరో నలుగురు మరణించినట్లు తెలుస్తోంది. హిడ్మా ఎన్ కౌంటర్తో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. హిడ్మాపై రూ. కోటికిపైగా రివార్డు ఉంది
AP-Telangana Border
Maredumilli Encounter
Alluri District
Tiger Zone
Maoists
Police Operation
Comb Operation
Hidma Killed
భద్రతా బలగాలు
మావోయిస్టు అగ్రనేత
ఎదురు కాల్పులు
Scroll for the next article