News29th Dec 03:51 PMSunil Byrisetty1 min read
పోలవరం పేరేంటి? వాజ్‌పేయా లేక పొట్టి శ్రీరాములు?
పోలవరం ప్రాజెక్టు పేరుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలవరానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొద్ది రోజుల కిందట ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన సో
పోలవరం ప్రాజెక్టు పేరుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలవరానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొద్ది రోజుల కిందట ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన సోదరుడు నాగబాబు కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే పోలవరం ప్రాజెక్టుకు వై.ఎస్. రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ పోలవరం ప్రాజెక్ట్ అని పేరు మారుస్తూ 2019లో అప్పటి మంత్రిమండలి తీర్మానం చేసి, జీవో కూడా జారీ చేసింది. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో దీనికి ఇందిరా సాగర్ అని పేరు ఉండేది. పోలవరం ప్రాజెక్టుకు వాజ్‌పేయి పేరు పెట్టాలనే ప్రతిపాదన బీజేపీ, కొంతమంది మేధావుల నుంచి వచ్చింది. దేశంలో నదుల అనుసంధానానికి బీజం వేసింది వాజ్‌పేయి. పోలవరం ప్రాజెక్టు ద్వారానే కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం సాధ్యమైంది. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, దానికి పూర్తి నిధులు అందించే బాధ్యతను కేంద్రం తీసుకోవడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. కనుక ఈ పేరైతే సీఎం చంద్రబాబు సైతం సానుకూలత వ్యక్తం చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.